దళిత మహిళ ఇంటిపై వైస్ ఛైర్​పర్సన్ భర్త కన్ను - న్యాయం చేయాలని బాధితురాలి విజ్ఞప్తి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 4:15 PM IST

thumbnail

Land Occupied by Municipal Vice Chairperson Husband: మున్సిపల్ వైస్ ఛైర్​పర్సన్ భర్త జమీల్ తన ఇంటి స్థలం ఆక్రమించారంటూ ఓ దళిత మహిళ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. 2008వ సంవత్సరంలో మహిళకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని మున్సిపల్ వైస్  ఛైర్​పర్సన్ భర్త జమీల్ ఆక్రమించి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యుడిపై పోలీసులు, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థలం విషయంలో న్యాయం చేయాలని బాధితురాలు డిప్యూటీ తహశీల్దారును ఆశ్రయించారు.

Encroachement of land in Anantapur District: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో లక్ష్మీదేవి అనే ఒంటరి దళిత మహిళ 2008లో లబ్ధి పొందిన ఇందిరమ్మ స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తోంది. వర్షాలకు శ్లాబ్ కూలడంతో ఇల్లును కూలగొట్టి కొత్త ఇంటి కోసం మార్కింగ్ వేసుకుంటే మున్సిపల్ ఆఫీస్ వైస్ ఛైర్​పర్సన్ అడ్డుకుంటున్నారని బాధితురాలు పేర్కొంది. ఈ స్థలం మా వార్డుకు చెందిన ముస్లింలది అని జమీల్ దౌర్జన్యానికి దిగారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం చేయాలని డిప్యూటీ తహసీల్దారును కోరానని బాధితురాలు తెలిపారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని బాధితురాలు చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.