టీడీపీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించలేదు: కేశినేని శ్వేత

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 7:59 PM IST

thumbnail

Kesineni Swetha Resigned for VMC Corporator: తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని కలలో కూడా ఊహించుకోలేదని వీఎంసీ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత (Kesineni Swetha) అన్నారు. చంద్రబాబుపై మాకున్న అభిమానం, ప్రేమ అలాంటిదని అన్నారు. ఈ మేరకు రాజీనామా ఆమోదించాలని మేయర్​ని శ్వేత కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను మేయర్‌కు అందజేశారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా ఆమోదం తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. 

ఒక సిట్టింగ్‌ ఎంపీ అయిన కేశినేని నానికి విజయవాడ ప్రాంతంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని సమాచారం వచ్చిందని తెలిపారు. ఇంత జరిగిన తర్వాత పార్టీలో ఉండడం సరైనది పేర్కొన్నారు. తాము ఎవరినీ తప్పు పట్టడం లేదని, పార్టీ కోసం చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉండవచ్చన్నారు. తన తండ్రికి జరిగిన అవమానం అందరికీ తెలిసిందేనని, గౌరవం లేని చోట తాము పని చేయలేమని చెప్పారు. పార్టీని నష్టపరచడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా టీడీపీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఇప్పటికే ప్రకటించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.