Kanipakam Varasiddhi Vinayakaswamy Brahmotsavam : కాణిపాకం వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం..
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2023, 10:03 AM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-09-2023/640-480-19541059-thumbnail-16x9-kanipakam-varasiddhi-vinayakaswamy-brahmotsavam1.jpg)
Kanipakam Varasiddhi Vinayakaswamy Brahmotsavam : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయం మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. వివిధ రకాల పూలతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 20 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పాలకమండలి, అధికారులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్నిపుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy)రామచంద్రారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే కాణిపాక వరసిద్ది వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ భద్రత ఏర్పాట్లను ఈవో వెంకటేశుతో కలిసి చిత్తూరు జిల్లా ఏఎస్పీ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచలను చేశారు.