భారీ శబ్ధాలతో వైసీపీ నేతల హంగామా - సామాజిక బస్సు యాత్రపై జడ్జి ఆగ్రహం

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 3:08 PM IST

thumbnail

Judge Angry Over YSRCP Samajika Sadhikara Bus Yatra : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) తలపెట్టిన సామాజిక బస్సు యాత్ర స్థానిక జడ్జికి ఆగ్రహం తెప్పించింది. వైసీపీ నిర్వహించిన బస్సుయాత్రలో భారీ శబ్ధాలు చేస్తూ.. నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి. ఈ సౌండ్ మోతతో కోర్టు కార్యకలాపాలకు ఇబ్బంది కలిగింది. భారీ శబ్ధాల నేపథ్యంలో కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ పోలీసులను కోర్టుకు పిలిపించిన న్యాయమూర్తి.. డీజేకు ఎవరు అనుమతిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. జడ్జి ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన  ట్రాఫిక్ పోలీసులు.. వెంటనే డీజేల మోతను నిలిపివేయించారు.  

 Samajika Sadhikara Bus Yatra : సాయంత్రం అంబేడ్కర్ కూడలిలో జరిగే సామాజిక బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలను ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సామాజిక బస్సుయాత్ర అంటే ఇదేనా.. ప్రజలను ఇబ్బందులు గురి చేయడమేనా అంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు.  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన ద్వారం సమీపంలో బారికేడ్లు పెట్టి.. రోడ్డు మూసివేయడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు ఇబ్బంది పడుతున్నారు. హిందూపురం ప్రధాన రోడ్డులో ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేయించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.