యువ చైతన్య యాత్రను ప్రారంభించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 17, 2024, 7:14 PM IST

thumbnail

JC Prabhakar Yuva Chaitanya Yatra: యువతకు సముచిత గౌరవం ఇవ్వాలన్నదే తెలుగుదేశం లక్ష్యమని, అందుకోసం సొంతంగా మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో యువ చైతన్య బస్సు యాత్రను ఈరోజు ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. చేనేతలు ఎక్కువగా ఉన్న యాడికి మండలంలో పట్టువస్త్రాల మార్కెటింగ్‌ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు.

TDP Former Mla Prabhakar Reddy: యువతను గౌరవించిన పార్టీలకే మద్దతు ఇస్తానని, ఎక్కడి ఉత్పత్తులు అక్కడే కొనే విధంగా చేసి తమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని జేసీ తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో రైతులు పండించే ఉత్పత్తులను ఎక్కడికక్కడ కొనుగోలు చేయించి అన్నదాతలకు శ్రమ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రజలను, రైతులను పలకరిస్తూ జేసీ తన యాత్ర సాగించారు. యువత, చిన్నారులు కనిపించిన చోట వారితో కలిసి నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.