దొంగ ఓట్లు చేర్చేవాళ్లను వదిలిపెట్టం - ఎన్నికలు మాకు జీవన్మరణ సమస్య: జేసీ ప్రభాకర్‌రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Nov 10, 2023, 5:09 PM IST

thumbnail

JC Prabhakar Reddy Meet SP and DIG in Anantapur :  తాడిపత్రి నియోజకవర్గంలో దొంగ ఓట్లు చేర్చేవాళ్లను వదిలిపెట్టమని మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, డీఐజీ అమ్మిరెడ్డిని ప్రభాకర్ రెడ్డి కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఓటరు జాబితాలో అక్రమాలకు తెగిస్తున్న తహసీల్దార్లు తమ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.

Muncipal Chairmen JC Prabhakar Reddy  On Bogus Votes : పులివెందుల వాళ్లను తాడిపత్రి నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్చుతున్న తహసీల్దార్లను వదిలిపెట్టను జాగ్రత్త అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. యల్లనూరు, పుట్లూరులో ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తున్న తహసీల్దార్లు పద్దతి మార్చుకోవాలని, దొంగ ఓట్లను చేర్చితే ఎట్టిపరిస్థితుల్లో వదలనని, ఎంతవరకైనా పోతానన్నారు. ఎన్నికలు తమకు జీవన్మరణ సమస్యగా చెప్పిన జేసీ.. ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకోనన్నారు. తాడిపత్రిలో మురుగు సమస్యపై అధికారుల్లో స్పందన లేకపోతే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. పోలీసు అధికారులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పటానికే వారిని కలిశానని.. రాజకీయాలు కానీ, ఎవరి మీద ఫిర్యాదు చేయటానికి కాదు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.