ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు - సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో ముఖాముఖి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 10:25 AM IST

thumbnail

Interview with Senior Advocate Sunkara Rajendra : ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వంటి ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న ఐదు వేలకుపైగా క్రిమినల్‌ కేసుల విచారణల్లో వేగం పెంచేందుకు సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు (Supreme Court Key Judgment) వెలువరించింది.

Supreme Court Issues Guidelines To High Courts on Representatives Cases : ఎన్నో సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్న ఈ కేసులు మన రాజకీయ, ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి సత్వర పరిష్కారానికి హైకోర్టులు, జిల్లా జడ్జీలు, ప్రత్యేక న్యాయస్థానాలకు (Special Courts)పలు సూచనలు చేసింది. ట్రయల్‌ కోర్టు (Trial Court)ల్లో జరుగుతున్న విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, జాప్యాన్ని నివారించేలా తక్షణమే తగిన సూచనలు చేయడానికి హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court Judgment on Public Representatives Cases : ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాలు స్వాగతించదగిన విషయమని సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రత్యేక కోర్టుల వల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందన్నారు. పదేపదే వాయిదాలు కోరడం వల్లే ఏళ్లతరబడి సాగదీస్తున్నారనీ, ఇప్పటికైనా సుప్రీం సూచనలు అందరూ గౌరవించాలని ఆయన సూచించారు.  నేర తీవ్రత ఆధారంగా కేసులను విభజించి పరిష్కరించాల్సిన అవసరం ఉందంటున్న సుంకర రాజేంద్రప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.