Innovative Protest in Ravulapalem : రావులపాలెంలో టీడీపీ వినూత్న నిరసన.. 'ఆకట్టుకునేలా ఇసుకాసుర' సైకత శిల్పం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 2:26 PM IST

thumbnail

Innovative Protest in Ravulapalem Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు​ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చెపట్టి మొదటి రోజు నుంచి నేటి వరకు అనానే కొనసాగిస్తున్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ కక్షతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వినూత్నంగా జగన్ ప్రభుత్వంలో ఇసుక స్కాం ఏ విధంగా జరిగిందే తెలుపుతూ ఇసుకాసురుడు అని ఇసుకతో నిరసన తెలిపారు. 

రావులపాలెం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 27వ రోజు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఇసుక గుట్టపై ఇసుకాసురుడు బోర్డు పెట్టి ఇసుక ఇసుక స్కాం అంటూ గుట్ట వద్ద తెలుగుదేశం నాయకులు కూర్చుని నిరసన తెలిపారు. ఇసుక దోపిడీతో పాటు ప్రభుత్వ సొమ్మును అన్ని రకాలుగా దోచుకున్నారని దీనికి తగిన మూల్యం జగన్ చెల్లించుకోవడానికి జీవితాంతం జైల్లోనే ఉండబోతున్నారని సత్యానందరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.