Fake votes: అనకాపల్లిలో ఓ ఇల్లు.. అందులో 280 ఓటర్లు..! వారందరు పంచాయితీ ఎన్నికల్లో ఓటేశారు..!

By

Published : Jul 22, 2023, 9:12 PM IST

thumbnail

Hundreds of fake votes in one door number: ఒక డోర్ నెంబర్​కి 5 లేదా 6 లేకుంటే 10 ఓట్లు ఉండటం సహజం.. కాని ఒకే డోర్ నెంబర్​కి ఆ గ్రామంలో 280కి పైగా ఓట్లు ఉన్నాయి. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం తీడ గ్రామంలో మూడు పోలింగ్ బూత్​లు ఉన్నాయి. వీటిలో ఒకే డోర్ నెంబర్​కి 280కి పైగా ఓట్లును నమోదు చేశారు. గ్రామంతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు ఓట్లుగా నమోదు చేసి.. 2019 ఎన్నికల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేశారు. ఈ గ్రామంలో దొంగ ఓట్లు నమోదు అయినట్లు గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు దీనిపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శనివారం నిర్వహించిన ఓటరు జాబితా పరిశీలనలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు.. బీఎల్వోలతో కలిసి ఇంటింటా సర్వే చేపట్టి దొంగ ఓట్లు తొలగించాలని ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురుద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి, స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ దొంగ ఓట్లను ప్రోత్సహించి తప్పుడు ఓ టర్ జాబితాలు తయారు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.