'ఎస్‌ఐ నోటిఫికేషన్'పై హైకోర్టు స్టే - పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే!
Published: Nov 17, 2023, 4:03 PM

High Court Stay On SI posts recruitments In Amaravati :ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఎత్తు పరంగా 2019లో అర్హత సాధించిన వారిని... ఇటీవల నియామకాల్లో అనర్హులుగా ప్రకటించారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌తో ఈటీవీ ముఖాముఖి.
High Court imposed temporary stay on SI posts recruitment process : నియామకాల్లో అన్యాయం జరిగిందని తమకు న్యాయం కావాలని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల తరఫున జడ శ్రావణ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తెలిపారు. ఎత్తు అంశంలో గతంలో అర్హులైనవారు ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో అర్హులైనవారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్ కోరారు. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై హైకోర్టులో స్టే విధించారు.