దుర్గమ్మను దర్శించుకున్న వెంకీ - బాబాయ్​ హోటల్లో 'సైంధవ్'​ యూనిట్ సందడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 5:05 PM IST

thumbnail

Hero Venkatesh Visit To VIjayawada Indrakiladri : హీరో విక్టరీ వెంకటేష్​ 75వ చిత్రంగా విడుదలవుతోన్నసైంధవ్‌ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి వెంకీ విజయవాడ వచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ద‌ర్శించుకున్నారు. ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఏఈఓ రమేష్ తదితరులు మర్యాద పూర్వకంగా వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం టిఫిన్ చేసేందుకు హీరో వెంకటేష్​ బాబాయ్ హోటల్‌కు వెళ్లారు. వెంకీ టిఫిన్​ చేస్తున్న సమయంలో అభిమానులు సెల్ఫీల  కోసం ఉత్సాహం చూపించారు.  

Saindhav Movie Promotions In Vijayawada :  శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్​టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 35 ఏళ్ల సినిమా ప్రయాణంలో భిన్నమైన పాత్రల్లో నటించానని ఆనందం వ్యక్తం చేశారు. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రేక్షకులు భిన్నత్వాన్ని ఆశిస్తున్నారని, తనకు అలాంటి కథలు రావడంతో మంచి సినిమాలు చేస్తున్నానని వెంకీ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.