Fire in RTC bus: ఆర్టీసి బస్సులో మంటలు.. కిటికీల గుండా బయటపడ్డ ప్రయాణికులు
Published: May 20, 2023, 10:53 PM

Fire broke out in an RTC bus : ఆర్టీసి బస్సులో మంటలు వ్యాపించి పొగలు రావటంతో అత్యవసర ద్వారం నుండి దూకేయటంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది.. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని అనంతసాగరం వద్ద బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి పొగలు రావటంతో ప్రయాణికులు బయందోళనకు గురయ్యారు. దీంతో తప్పించుకునేందుకు బస్సులో ఉన్న ప్రత్యేక ద్వారం గుండా దూకేయటంతో ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు.. నెల్లూరు నుండి బద్వేలు వైపు వెళ్తున్న ఆర్టీసి బస్సు అనంతసాగరం వచ్చేసరికి ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బస్సు మొత్తం పొగలతో నిండి పోవటంతో బస్సులో ఉన్న అత్యవసర ద్వారం గుండా.. దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికులకు ఎమీ అవ్వకపోవటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఇంజిన్ వేడి ఎక్కి మంటలు వ్యాపించి ఉండవచ్చని డ్రైవర్ తెలిపాడు.