త్వరలో జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల - పవన్‌ కల్యాణ్‌తో భేటీ

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 17, 2024, 9:02 PM IST

thumbnail

Ex Minister Konathala Ramakrishna to Join Janasena Party: మాజీమంత్రి  కొణతాల రామకృష్ణ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. నేడు హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన  కొణతాల త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఉత్తరాంధ్రలో సీనియర్‌ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన 1989 నుంచి 1996 వరకు అనకాపల్లి ఎంపీగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. వైఎస్‌ మరణానంతరం వైఎస్సార్సీపీలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 

 2014 ఎన్నికల అనంతరం కొణతాల రామకృష్ణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. కొణతాల గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ, ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున ఆ ప్రాంతం సమస్యలపై సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్కాకేజీ ఇవ్వాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కొణతాల రామకృష్ణ ఉత్తరాంధ్రలో, దిల్లీలో పోరాటాలు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.