మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్​ విసిరి తోక ముడిచాడు: కొల్లు రవీంద్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 6:40 PM IST

Updated : Dec 27, 2023, 7:31 PM IST

thumbnail

EX Minister Kollu Ravindra Fires On Sidiri Appalaraju : బీసీ సంక్షేమం, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమంటూ మంత్రి సీదిరి అప్పలరాజుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో కొన్ని గంటల పాటు సీదిరి కోసం వేచి చూశారు. నారా లోకేష్​కు బహిరంగ సవాల్ చేసిన సీదిరి అప్పల రాజు దమ్ముంటే తనతో చర్చించాలని కొల్లు రవీంద్ర అక్కడే కూర్చున్నారు.

Kollu Ravindra Challenge to Sidiri Appalaraju : సవాల్​ విసిరినంత సూటిగా సీదిరి అప్పలరాజు చర్చకు ఎందుకు రాలేదని కొల్లు రవింద్ర ధ్వజమెత్తారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్దకు ఈరోజు ఉదయం 11 గంటలకు రావాలని మంత్రికి ముందే సమాచారం ఇచ్చినా రాకపోవటాన్ని తప్పుబట్టారు. ఈ సందర్భంగా కొల్లు మాట్లాడుతూ బీసీలను అన్ని విధాలా అణగ దొక్కిన చరిత్ర జగన్​రెడ్డిదని ధ్వజమెత్తారు. చర్చకు రాకుండా సీదిరి తోక ముడిచారని రవీంద్ర దుయ్యబట్టారు.  

Last Updated : Dec 27, 2023, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.