ఇంద్రకీలాద్రిపై ఇంగ్లండ్ క్రికెటర్స్ సందడి - అమ్మవారి ఆశీర్వచనం అందజేసిన అర్చకులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 4:41 PM IST

thumbnail

England Team Visited Kanakadurgamma Temple : క్రికెట్ అండర్ 19 లో భాగంగా ఇంగ్లండ్ జట్టు భారత్​లో అడుగుపెట్టింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న యువ క్రికెటర్లు.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దేవస్థానం పాలకమండలి సభ్యులు క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. ఆలయ పండితులు యువ క్రీడాకారులకు అమ్మవారి కుంకుమ బొట్టును నుదుటన పెట్టి ఆహ్వానించారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. వారికి పండితులు వేద ఆశీర్వదించారు. యువ క్రికెటర్లకు ఆలయ ఏఈఓ చంద్రశేఖర్, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. స్థలపురాణంగా ప్రసిద్ది చెందిన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని యువ క్రికెట్లు పేర్కొన్నారు.                                                 

ఈ మధ్యకాలంలోనే.. మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ డి. వెంకటరమణ, సినీనటి హన్సిక ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.