Invitation to CM: విజయవాడలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.. సీఎం జగన్‌ను ఆహ్వానం

By

Published : May 9, 2023, 7:19 PM IST

thumbnail

Invitation To CM: విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరగనుందని తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపి.. రావాలని ఆయన కోరారు. అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఈవో లవన్న, వేద పండితులు సీఎంను కలిశారు. శ్రీశైలంలో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపిన వారు.. రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తీర్ధప్రసాదాలు అందజేసిన వేదపండితులు.. అలాగే వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.