ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు- ఈవో కెఎస్​ రామారావుతో ముఖాముఖి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 1:12 PM IST

thumbnail

Durga Temple EO KS Rama Rao Interview : విజయవాడ ఇంద్రకీలాద్రి మరికొద్ది గంటల్లో అరుణ కీలాద్రిగా మారబోతోంది. భవానీదీక్ష దారులు సుదూర కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన బెజవాడ చేరుకుంటున్నారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు భవానీ దీక్ష విరమణలకు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. సుమారు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది వరకు భవానీలు వస్తారని అంచనా వేస్తున్నారు. సీతమ్మ వారి పాదాలు, పున్నమిఘాట్‌, భవానీ ఘాట్​లలో కేశఖండన కోసం ఏర్పాట్లు చేశారు. 

Bhavani Deeksha Viramana : కృష్ణా నదిలో పవిత్ర స్నానానికి అవకాశం లేనందున జల్లు స్నానాల కోసం 800 షవర్లు అందుబాటులో ఉంచుతున్నారు. భవానీల కోసం కొండ దిగువన నాలుగు హోమ గుండాలు నిర్మించారు. గత ఏడాది నవంబరు 23 నుంచి భవానీ మండల దీక్షదారణలు, డిసెంబరు 13 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమయ్యాయి. మూడో తేదీ ఉదయం ఆరున్నర గంటలకు అగ్నిప్రతిష్టాపన అనంతరం భవానీలను దర్శనానికి అనుమతిస్తారు. ఏడో తేదీ ఉదయం పది గంటలకు మహాపూర్ణాహుతితో భవానీదీక్షలు సమాప్తి అవుతాయి. దుర్గగుడిపై భవానీదీక్ష విరమణ ఏర్పాట్లపై ఈవో కె.ఎస్‌.రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.