మాట తప్పను, మడమ తిప్పనని నిరుద్యోగులను మోసం చేశారు: ఎమ్మెల్సీ చిరంజీవి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 9:21 PM IST

thumbnail

DSC Candidates Protest in Avanigadda : ఏపీపీఎస్సీ ద్వారా 2 లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయారని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ డీఎస్సీ ఎమ్మెల్సీ చిరంజీవి అన్నారు. మాట తప్పాను-మడమ తిప్పనని సవాలు చేసిన జగన్,​ ఇప్పుడు డీఎస్సీ నిరుద్యోగులకు ఏం చేశారని ప్రశ్నించారు. అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీఎం జగన్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సమావేశంలో రాష్ట్రంలో 18వేల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు ప్రకటించినా ప్రభుత్వం మెగా డీఎస్సీ కాకుండా మినీ డీఎస్సీ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు.

MLC Chiranjeevi Comments: అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న మల్లేష్ ఆత్మహత్యయత్నానకి పాల్పడిన ఘటన జగన్​ ప్రభుత్వం దివాళా పరిస్థితికి ప్రత్యక్ష నిదర్శనమని చిరంజీవి అన్నారు. వారం రోజుల్లో సీపీఎస్​ రద్దు అని ఉద్యోగులను నమ్మబలికి మోసం చేశారని ధ్వజమెత్తారు. సర్వశిక్ష అభియాన్​ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. జగన్​ సర్కార్​ ఉపాధ్యాయులను శత్రువులుగా భావిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన చెందారు. గతంలో కర్ణాటక, మహారాష్ట్రతో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు బిహార్​తో పోటీపడుతుందని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.