Dola Veeranjaneya Swamy fire on CM Jagan జగన్ ప్రభుత్వం సంతలో సరుకుల్లా అమ్మకానికి పెట్టిన ఎంబీబీఎస్ సీట్లు:టీడీపీ నేత డోలా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 3:24 PM IST

thumbnail

Dola Veeranjaneya Swamy fire on CM Jagan :ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను జగన్ రెడ్డి ప్రభుత్వం సంతలో సరుకుల్లా అమ్మాకానికి పెట్టడం దుర్మార్గమని టీడీపీ ఎమ్మెల్యే డోలాబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. కొత్త కళాశాలు వస్తే తమ ఎంబీబీఎస్ కల నెరవేరుతుందనుకున్న బడుగు, బలహీన వర్గాల ఆశను జగన్ చిదిమేశాడంటూ మండిపడ్డారు. తాను పేదల పక్షమని కల్లబొల్లి మాటలు చెప్పే జగన్ రెడ్డి ఆచరణలో మాత్రం పైసలు ఇచ్చిన వారికే మెడికల్ సీట్లు(mbbs seats) కట్టబెట్టడం పెత్తందారీ ఆలోచన కాక మరేమిటని నిలదీశారు.  

మీ పిల్లలను డాక్టర్, ఇంజనీర్ ఏది చదివించినా ఫీజు తానే కడతానని ప్రతిపక్షంలో గొంతు చించుకున్న జగన్ అధికారంలోకి రాగానే బడుగులకు వైద్య విద్య దూరం చేయడం మాట తప్పి మడమ తిప్పడం కాదా అంటూ డోలా బాలవీరాంజనేయస్వామి దుయ్యబట్టారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో(private medical colleges) సైతం ఏ కేటగిరీ సీట్లను రిజర్వేషన్ ప్రాతిపదికన ఇస్తుంటే.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎత్తేసి పేదలకు జగన్ తీవ్ర అన్యాయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.పేద విద్యార్థులు కొత్తగా వచ్చిన 750 ఎంబీబీఎస్ సీట్లలో 168 సీట్లను పేద విద్యార్థులు కోల్పోతున్నారన్నారు. ఏపీ కంటే చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఏడాదికి రూ.5 లక్షలయితే మన రాష్ట్రంలో కోటి వరకూ ఖర్చవుతుందన్నారు. అంత డబ్బు కట్టి ఎంబీబీఎస్ చదవడం పేదల వల్ల అయ్యే పనేనా అని ప్రశ్నించారు. సీట్ల అమ్మకం వద్దని జూనియర్ డాక్టర్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా సీట్ల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డోలా బాలవీరాంజనేయ స్వామి డిమాండ్‌చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.