అరకులో అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ - మహాభాగ్యమన్న పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 8, 2024, 7:53 PM IST

thumbnail

BJP state president Purandeshwari : అయోధ్య రామయ్య అక్షింతల పంపిణీ ఊరూ, వాడా పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని అక్షింతలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో అయోధ్య రాముని అక్షింతల వితరణ కార్యక్రమం జరిగింది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో కలిసి రామ అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక గిరిజనులకు ఈ అక్షింతలను పంపిణీ చేశారు. 

ఘనంగా శోభాయాత్ర ఈ కార్యక్రమానికి ముందు అరకులోయలో పురవీధుల్లో అక్షింతలతో శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో అయోధ్య అక్షింతలను తన చేతుల మీదుగా గిరిజనులకు అందించడం మహాభాగ్యంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, బీజేపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.