DGP Rajendranath Reddy: హత్యలు, హత్యాయత్నాలు తగ్గుముఖం పట్టాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

By

Published : Jun 27, 2023, 10:21 PM IST

thumbnail

Crime Rate in State:  గత నాలుగేళ్లలో.. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో  గతంలో పోల్చుకుంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, రోడ్డు ప్రమాదాలు, మోసాలు, మహిళలపై నేరాలు సహా అన్ని నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో  గత సంవత్సరం 22 హత్యలు జరిగితే ఈ సంవత్సరం 17 హత్యలు మాత్రమే జరిగాయని డీజీపీ వెల్లడించారు. గతేడాది 36 హత్యాయత్నం కేసులు నమోదు కాగా.. సంవత్సరం 18 కేసులు మాత్రమే నమోదయినట్లు డీజీపీ తెలిపారు.  దిశాయాప్‌ను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు. తీవ్రమైన నేరాలకు శిక్షలు పడేలా పోలీసులకు లక్ష్యాలు విధించినట్లు చెప్పారు. పది వేల కేసుల్లో ఇప్పటికే వెయ్యి కేసులను ఛేదించినట్లు డీజీపీ వెల్లడించారు. వీటిలో 67 శాతం కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన మహిళా పోలీసులకు ప్రశంసాపత్రాలు, నగదు ప్రోత్సాహకాలు డీజీపీ అందజేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.