సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్ : పురందేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 18, 2024, 1:37 PM IST

thumbnail

Daggubati Purandeswari Tribute to NTR: నందమూరి తారకరామారావు ఒక ప్రభంజనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పురందేశ్వరి నివాళులర్పించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు సినీ రంగంలో నటించలేదని, జీవించారని పురందేశ్వరి వ్యాఖ్యనించారు. తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అన్న పదానికి మారు పేరుగా నిలిచారని అభివర్ణించారు. రాజకీయాల్లోనూ రాణించి పేదలను ఆదుకున్నారన్నారు. 

కరవు ప్రాంతమైన రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులను అందించి వారి దాహార్తిని తీర్చారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని, తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరని పేర్కొన్నారు. అందుకే తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు.

Purandeswari on Ayodhya Ram Mandir Pran Pratishtha: అదే విధంగా ఈనెల 22న ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. ఈనెల 19న అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నామని, అదే విధంగా అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపనను తిలకించేలా అవకాశం కల్పించాలన్నారు. ఈనెల 21 వరకు మాత్రమే సెలవులు పొడిగించడాన్ని ఆమె ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.