'వేల కోట్ల కుంభకోణంలో అమిత్ షా, జగన్ కుమ్మక్కు - పురందేశ్వరి ఫిర్యాదు చేసినా ఏపీలో లిక్కర్ దందాపై చర్యలేవీ'
CPI Ramakrishna About AP Liquor Policy: వంద కోట్ల దిల్లీ లిక్కర్ స్కాంపై ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న కేంద్రం.. వేల కోట్ల రూపాయల్లో జరుగుతున్న ఏపీ లిక్కర్ దందాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీజీపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) వినతిపత్రం ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అమిత్ షా (Amit Shah), జగన్ (YS Jagan) కుమ్మక్కై ఏపీలో మద్యం కుంభకోణంలో వేలకోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
Drought Conditions in AP: నీరు లేక పంట పొలాలు ఎండిపోతుంటే సీఎం జగన్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సొంత జిల్లాలో పంటలు ఎండిపోతున్నా కూడా సీఎం జగన్ స్పందించడం లేదని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నాలుగు వందల మండలాల్లో పంటలు నాశనం అయ్యాయని, అధికారులు సైతం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో 20, 21వ తేదీలలో నిరసన దీక్ష చేస్తామని రామకృష్ణ తెలిపారు.