జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం.. సీఎన్​జీ గ్యాస్‌ సిలిండర్ల లారీ క్యాబిన్‌లో మంటలు

By

Published : Mar 5, 2023, 11:57 AM IST

thumbnail

Fire Accident On National Highway In NTR District : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామ సమీపంలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి సమీపంలో సీఎన్జీ సిలిండర్ల లారీ క్యాబిన్‌లో నిన్న (శనివారం) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రాణభయంతో డ్రైవర్‌, క్లీనర్‌ బయటకు దూకి తప్పించుకున్నారు. క్యాబిన్‌ మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. వాహనంలో సీఎన్జీ గ్యాస్‌ సిలిండర్లు ఉండటంతో ఏమైనా ప్రమాదం జరుగుతుందోనని ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేవారు భయంతో వణికిపోయారు. స్థానిక ప్రజలు సైతం దగ్గరకు వచ్చేందుకు వెనుకడుగు వేశారు. వారు వెంటనే జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో తక్షణమే వచ్చి మంటలను ఆర్పివేశారు. చిల్లకల్లు ఎస్​ఐ దుర్గా ప్రసాద్‌ తన సిబ్బందితో ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశానికి వచ్చి లారీని క్రేన్‌ సాయంతో రహదారిపై నుంచి పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డ్రైవర్ వంట చేస్తుండగా లారీ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయని తెలిసింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.