కర్నూలు మున్సిపల్​ సిబ్బంది నిర్వాకం - ఆ చెత్తనే కాదు ఈ చెత్తనూ వదలటం లేదు!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 7:51 PM IST

thumbnail

Chicken Shop Owners Protest in front of Collectorate: కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చికెన్ షాపుల యజమానులు ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరపాలక సంస్థ నిర్వాకంతో ఇబ్బందులు పడుతున్నామని ఆరోపించారు. తాము గతంలో  చికెన్ షాపుల్లో వచ్చే వేస్టేజ్​ని అమ్ముకునే వారమని తెలిపారు. కానీ, మున్సిపల్ కమిషనర్ తమకు తెలియకుండా టెండర్స్​ను పిలిచారని, ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది తాము అమ్ముకునే చికెన్ వేస్టేజ్ సైతం తరలిస్తున్నారని ఆరోపించారు.

ఇప్పటికే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మెుదలూ చెత్త పన్ను, ట్రేడ్ లైసెన్స్, దుకాణాల అద్దె, విద్యుత్ ధరలతో  తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వ్యాపారస్థులు పేర్కొన్నారు. చికెన్  వేస్టేజ్ సైతం ఉచితంగా ఇవ్వాలని అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చికెన్ షాపుల్లో వచ్చే వేస్టేజ్ బయటి వ్యక్తులకు అమ్ముకునే వారమని వ్యాపారులు పేర్కొన్నారు.  అధికారులు వేస్టేజ్​ని ఉచితంగా తీసుకుని పోవడం మానుకోవాలని దుకాణాల యజమానులు తెలిపారు. లేని పక్షంలో కర్నూలు బంద్​కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.