అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2024, 1:22 PM IST

thumbnail

Car Driver Family Suicide Attempt in Kavali : గత నాలుగు రోజుల క్రితం అప్పుల బాధ తాళలేక అనకాపల్లి జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అదే సమస్యతో కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే,

ఆర్థిక ఇబ్బందులే కారణం : జిల్లాలోని కావలిలో అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వాంతులు కావడంతో స్థానికులు గమనించి 108 వాహనంలో కావలి ఆస్పత్రికి బాధితులను తరలించారు. కార్ డ్రైవర్‌గా పని చేస్తున్న భాస్కర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా లక్షల్లో అప్పులు చేసినట్లు స్థానికులు తెలిపారు. తీసుకున్న నగదు తిరిగి చెల్లించలేక దిక్కుతోచని స్థితిలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అన్నంలో పురుగులమందు కలుపుకుని తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.