British-era Paradi Bridge Fallen Into Disrepair: ప్రమాదపు అంచుల్లో బ్రిటిష్ కాలం నాటి వంతెన.. రాకపోకలకు అనుమతివ్వని పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 12:53 PM IST

thumbnail

British-era Paradi Bridge Fallen Into Disrepair: విజయనగరం జిల్లాలో బొబ్బిలి వద్ద ఉన్న బ్రిటిష్ కాలం నాటి పురాతన వంతెన ప్రమాదపు అంచుల్లోకి చేరింది. చూడటానికి  కూలిపోయే స్థితిలో ఉన్న ఆ వంతెనపై వెళ్ళేందుకు జంకే పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు, వాహనదారులు ఆ వంతెన మీద ప్రయాణాలు చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్షాలు కూడా పడుతుండటంతో.. వంతెన మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు..  ఈ రోజు రాత్రి నుండి పారాది వంతెన నుండి ప్రయాణించడానికి ఎలాంటి వాహనాలను అనుమతించమని పోలీసులు ప్రకటించారు. వంతెనను పరిశీలించిన డీఎస్పీ.. ఇతర మార్గాల్లో రాకపోకలు సాగించాలని డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఒరిస్సా వెళ్లేందుకు ప్రధాన మార్గం అయినందున చత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీని వలన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఈ వంతెన నిర్మాణానికి 11 కోట్ల నిధులు మంజూరైనా అధికారుల నిర్వాకంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆ వంతెన మీద ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వంతెన నిర్మాణం చేయాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.