తరగతి గదిలో ఊడిపడ్డ సీలింగ్​ ఫ్యాన్​ - ఐదేళ్ల బాలుడికి గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 10:00 PM IST

thumbnail

Boy Injured Falling a Fan in School : కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం ఉర్థూ ప్రాథమిక పాఠశాలలో సీలింగ్ ఫ్యాన్ మీద పడి ఐదేళ్ల బాలుడికి స్వల్పగాయాలు కావడంతో పెనుప్రమాదం తప్పింది. అన్వార్ అనే విద్యార్థి పాఠశాల తరగతి గదిలో ఉండగా ఒక్కసారిగా సీలింగ్‌ ఫ్యాన్‌ మీద పడటంతో అన్వార్‌ ముక్కుపై స్వల్పగాయాలయ్యాయి. దీంతో బాలుడిని హూటహూటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం విద్యార్థికి వైద్యులు ఆరు కుట్లు వేసి ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.  

అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదానికి పాఠశాల సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తరగతి గదిలోని ఫ్యాన్ ఒక్కసారిగా​ ఊడి పడ్డప్పటికీ అన్వార్​ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పాఠశాల సిబ్బంది వెంటనే అన్వార్​ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు విద్యార్థిని పరీక్షించి ముక్కుపై గాయం కాగా వైద్యులు కుట్లు వేసి చికిత్స చేశారు. పెను ప్రమాదం తప్పడంతో పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.