సంక్షేమ పథకాలకు జగన్​ ఫొటో - బీజేపీ నేతల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 9:30 PM IST

thumbnail

BJP Leaders Questioned on Only Jagan Photo: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నడిపిస్తూ.. కరపత్రాలలో ముఖ్యమంత్రి బొమ్మ మాత్రమే ఉండడంపై కర్నూలు బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్​ ప్రకారం ఫొటోలను ఎందుకు ముద్రించలేదని అధికారులను ప్రశ్నించారు. కరపత్రంపై మోదీ చిత్రం ఎందుకు ముద్రించలేదని అధికారులను నిలదీశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా గోనెగండ్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులను స్థానిక బీజేపీ నేతలు ప్రశ్నించగా వారు సమధానం చెప్పలేక ఇబ్బందిని ఎదుర్కోన్నారు. 

జగనన్న కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని.. ఆ నిధులతో పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ముఖ్యమంత్రి జగన్​ ఫొటోనే ముద్రించుకుని ప్రచారం చేసుకుంటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోనున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.