NTR Centenary Celebrations: ఈనెల 28న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు: బాలకృష్ణ

By

Published : Apr 23, 2023, 3:39 PM IST

thumbnail

NTR Centenary Celebrations: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లా విజయవాడలోనే ఆయన శతజయంతి వేడుకల శంఖారావాన్ని ఈ నెల 28వ తేదీన పూరిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నడయాడిన ప్రాంతంలోనే ఈ వేడుక నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా పాల్గొంటారని బాలయ్య బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం జరిగే ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.  

"ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి కమిటీ ఛైర్మన్ జనార్దన్ ఆధ్వర్యంలో విజయవాడలో వేడుకల శంఖారావాన్ని పూరించనున్నాము. ఎన్టీఆర్ నడయాడిన విజయవాడలోనే  ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు,  హీరో రజనీకాంత్ కూడా పాల్గొంటారు. శుక్రవారం జరిగే ఈ వేడుకకు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను." - బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.