Sidiri Appalaraju comments: తెలంగాణ మీ జాగీరా హరీష్ రావు..?: మంత్రి సీదిరి అప్పలరాజు

By

Published : Apr 14, 2023, 11:18 AM IST

thumbnail

AP MInister Sidiri Appalaraju fire on TG Minister Harish Rao: ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి రావడం మానేస్తే.. అక్కడ అడుక్కు తినడం తప్ప, మరేమీ ఉండదంటూ.. ఏపీ పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్న మంత్రి సీదిరి అప్పలరాజు.. ముందు తెలంగాణ సంగతి చూసుకోవాలంటూ కేటీఆర్‌, హరీష్‌ రావు, కవితలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

తెలంగాణ మీ జాగీరా.. విశాఖ స్టీల్‍‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఇటీవలే తెలంగాణ మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యాలపై సీదిరి అప్పలరాజు గురువారం రోజున ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..''హరీష్ రావు వాళ్ల మామ కేసీఆర్‌తో కలిసి ఆ ఫామ్ హూజ్‌లో కూర్చోని కల్లు తాగడేమోనని నాకు అనిపించింది. కల్లు త్రాగిన కోతిలాగా హరీష్ రావు మాట్లాడతా ఉన్నాడు. మీ మామలాగా కల్లు తాగడం లేదిక్కడ. పాపం కవిత్కలాగా అలాంటి ఛార్ట్లు కూడా లేవు మా దగ్గర. మా దగ్గర మీలాగా లిక్కర్ స్కామ్ కేసులు కూడా లేవు. మాట్లాడే ముందు హరీష్ తన శరీరాన్ని దగ్గర పెట్టుకోని మాట్లాడాలని కోరుతున్నా. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో బిడ్డు వేస్తామని చెప్తవా.. అలా ఎలా వేస్తావ్..?, అంటే దాని అర్థం ఏంటి..ప్రైవేటికరణకు నువ్వు అనుకులామా..? లేక వ్యతిరేకమా..?. బంగారు తెలంగాణ అని చెప్పి తీసుకున్నారు కదా.. దొరల పాలనలో ఏం జరుగుతుంది. నువ్వేమో మంత్రివి, మీ మామగారేమో ముఖ్యమంత్రి, ఆయనకో కుమారుడు ఆయనో మంత్రి. తెలంగాణ మీ జాగీరా..?. మీరొక ప్రాంతీయ ఉగ్రవాదులు'' అంటూ పరుష పదజాలంతో వ్యాఖ్యానించారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.