Aidwa protested against woman sexual harassment : 'రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదా..?' అధికారుల నిర్లక్ష్యంపై ఐద్వా ఆగ్రహం

By

Published : Aug 16, 2023, 4:11 PM IST

thumbnail

Aidwa protested against woman sexual harassment : రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఐద్వా ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేపట్టారు. జిల్లాలోని తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డి గ్రామంలో దళిత మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై అధికారుల నిర్లక్ష్య దోరణిపై నిరసన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న జరిగిన ఈ ఘటనపై అధికారులు ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పొలం పనికి వెళ్లిన మహిళా కూలీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలా చేయటమే కాకుండా ఆ దృశ్యాలను సెల్​ఫోన్లలో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెట్టడంపై మహిళా నాయకురాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా నాయకురాలు అలివేలమ్మ డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.