'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో ఘర్షణ

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 18, 2024, 7:21 PM IST

thumbnail

Adudam Andhra Program Clash in Anantapur District : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ' ఆడుదాం ఆంధ్ర ' కార్యక్రమం అనంతపురం జిల్లాలో ' కొట్టుకుందాం ఆంధ్రా' గా మారింది. కంబదూరు మండల కేంద్రంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కబడ్డీ పోటీల్లో గురువారం ఆటగాళ్ల మధ్య ఘర్షణ నెలకొంది. కంబదూరు, తిమ్మాపురం జట్ల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పాయింట్ల విషయంలో ఇరు జట్ల మధ్య తోపులాటకు దారి తీసింది.

Clash Between Two Teams in Kabaddi Game : కబడ్డీ పోటీలో ఎంపైర్​ ఇచ్చిన పాయింట్ల విషయంలో తేడా వచ్చి ఇరు జట్ల వాగ్వాదానికి దిగారు. క్రీడాకారుల మధ్య చిన్నగా మొదలైన ఘర్షణ మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఎంపైర్​పై సైతం క్రీడాకారులు దాడికి యత్నించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై ఆరాదీశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.