రోడ్డుపై చెల్లాచెదురైన గ్యాస్ సిలిండర్లు - అదృష్టం కొద్దీ బయటపడ్డారు!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 1:07 PM IST

thumbnail

A Sand Lorry Collided with Gas Cylinder Lorry : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి కనిగిరికి వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల వాహనాన్ని.. అదే మార్గంలో నెల్లూరు నుంచి ఇసుక లోడ్​ తో వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీ కొని పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో లారీలో ఉన్న గ్యాస్ సిలిండర్ల రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాద సమయంలో అటుగా వెళ్తుతున్న ప్రయాణికులు, వాహనదారులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఒక్క సిలిండర్ కూడా లీక్ కాకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. రోడ్లుపై చెల్లాచెదురుగా పడిన గ్యాస్ సిలిండర్లను తొలగించారు. ట్రాఫిక్​కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.