TTD: శ్రీవారికి వైభవంగా చక్రస్నానం..

By

Published : Oct 15, 2021, 11:59 AM IST

Updated : Oct 15, 2021, 12:17 PM IST

thumbnail

బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైన శ్రీవారి చక్రస్నానం వైభవంగా సాగింది. కరోనా దృష్ట్యా ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవ రోజుల్లో బహురూపులతో.. విభిన్న వాహనాల్లో దర్శనమిచ్చాడు దేవదేవుడు.. ఆనంద నిలయానికి చేరుకునే ముందు.. ఆ స్వామికి, ఉభయ దేవేరులకు.. చక్రత్తాళ్వార్లకు.. స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలతో అర్చకులు చేసే అభిషేక కైంకర్యాన్ని అందుకుని.. ధూప దీపాదికంతో వేంకటేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఈ కార్యక్రమం తర్వాత.. స్వామి ప్రతినిధిగా చక్రత్తాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. కరోనా వేళ.. ఆలయం లోపలే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పుష్కరిణిలో.. చక్రత్తాళ్వారుకి స్నానమాచరింపజేశారు.

Last Updated : Oct 15, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.