సైకిల్ తొక్కుతూ మురికి గుంతలో పడ్డ చిన్నారిని కాపాడిన రిక్షావాలా

By

Published : Oct 26, 2022, 10:20 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

మురికి గుంతలో పడ్డ ఓ చిన్నారిని చాకచక్యంగా కాపాడాడు ఓ రిక్షావాలా. ఉత్తరాఖండ్​ రూడ్కీలోని బహదురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శాంతారా గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు మురికి గుంతలో పడ్డాడు. సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న బాలుడు.. నేరుగా వెళ్లి గుంతలో పడి మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న రిక్షా డ్రైవర్.. బాలుడిని గమనించి వెంటనే అతడిని కాపాడాడు. ఈ దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. తమ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు బాలుని తల్లిదండ్రులు రిక్షా డ్రైవర్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.