కెనడాలో భారీగా ఆస్తులు స్విస్ బ్యాంక్​లో అకౌంట్ గురించి షాకింగ్ లెక్కలు చెప్పిన సీనియర్ నటుడు

By

Published : Oct 25, 2022, 3:46 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా పేరు పొందారు సీనియర్ నటుడు నరసింహరాజు. వెండితెరతో పాటు బుల్లితెరపై మెరిశారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్​ రోల్ పోషించిన అనుకోని ప్రయాణం అనే సినిమాతో చాలా కాలం తర్వాత ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సీనియర్ నటుడు షాకింగ్​ నిజాలు బయటపెట్టారు. అలీతో సరదాగా టాక్​ షోకు వచ్చిన ఆయన కెనడాలో ఉన్న భారీ ఆస్తులపై క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఎలా వచ్చాయో చెప్పారు. సినిమాల్లో తన ప్రయాణం 51ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిందని అయితే అవకాశాలు ఆ రోజు నుంచి ఆగిపోయాయని దాని కారణాలు ఏంటో వివరించారు. ఈ షోకు నరసింహరాజుతో పాటు అలనాటి అందాల తార ప్రేమ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా అనుకోని ప్రయాణం అక్టోబర్​ 28న విడుదలకు సిద్ధంగా ఉంది.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.