ETV Bharat / sukhibhava

గుండెపోటు రాకుండా ఉండాలంటే.. రోజుకు ఎన్ని ఉల్లిపాయలు తినాలో తెలుసా?

author img

By

Published : Jun 25, 2022, 7:03 AM IST

ఉల్లిని ఇళ్లలో అన్ని వంటల్లోనూ వాడుతూ ఉంటాము. అయితే అది రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంతకీ దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం.

Impressive Health Benefits of Onions
ఉల్లిపాయలు

'ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు' అనేది సామెత. ఎందుకంటే ఉల్లి వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉల్లిపాయ లేని కూరలేమైనా చెప్పాలంటే కష్టమే. ప్రతి కూరలోనూ కచ్చితంగా వాడే ఉల్లి ఉపయోగాలేమిటో చూద్దాం..

  • శరీరంలోని ముఖ్య భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుంది.
  • ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఉత్తేజపరుస్తుంది.
  • మనలోని శక్తి సామర్థ్యాలు మెరుగుపరిచి కణాల వృద్ధికి దోహదపడుతుంది.
  • ఐరన్, రాగి, పోటాషియం సమృద్ధిగా వుంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి ఉల్లి చాలా మంచిది.
  • శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. ఉల్లిలో ఉండే రిడక్టేజ్ అనే ఎంజైము కొవ్వు ఉత్పత్తిని నియత్రించేందుకు దోహదం చేస్తుంది.
  • గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండెపోటు రాకుండా తక్కువ స్థాయి కొవ్వుతో శరీరాన్ని నియంత్రిస్తుంది.
  • శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు స్థాయిని ప్రభావితం చేస్తుంది.
  • దంత సంబంధ క్రిములను నాశనం చేస్తుంది.
  • ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకలలో సాంద్రత పెంచుతుంది. మెదడుకు ఒత్తిడి తగ్గిస్తుంది.
  • తెల్ల ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఆలివ్ ఆయిల్, తెల్ల ఉల్లిరసాన్ని కలిపి వాడితే మరింత మంచిది.
  • ఉల్లి గుజ్జు ముఖానికి పట్టించటం వలన మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి.

రోజుకు 100గ్రాముల పరిమాణంలో పచ్చి ఉల్లిపాయ తింటే.. అధిక కొవ్వును నియంత్రణలో ఉంచొచ్చు. గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లిలో క్వర్సిటిన్​ అనే పదార్థం ఉంటుంది. ఇది క్యాన్సర్​ నుంచి రక్షణ కల్పిస్తుంది. పచ్చి ఉల్లిపాయ ముక్కలను ఒక నిమిషం పాటు నమిలితే.. నోట్లోని హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతుంది.

ఏ ఉల్లి తినాలంటే?
ఉల్లి రెండు రకాలుగా ఉంటుంది. మార్కెట్లలో ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి లభిస్తుంది. అయితే.. ఎర్రగా ఉండే ఉల్లిలో కంటే.. తెల్లగా ఉండే ఉల్లిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. తెల్ల ఉల్లిని తినడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు.

పైల్స్​ సమస్యకు..
పైల్స్​ సమస్యను పరిష్కరించడంలో కూడా ఉల్లిపాయ అద్భుతంగా పని చేస్తుంది. ఇందుకోసం ఉల్లిపాయను ముద్దలాగా చేసుకోవాలి. పెద్ద చెంచాడు ఉల్లిపాయ పేస్ట్​లో రెండు స్పూన్ల చక్కెర కలుపుకొని.. రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. పొట్ట నిండా విటమిన్లు నింపుకున్న ఉల్లిపాయను పచ్చిగా తిన్నా, వంటల్లో వాడినా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లి విలువను గుర్తించి వంటల్లో విరివిగా వాడటం మంచిది.

గుండెపోటు రాకుండా ఉండాలంటే.. రోజుకు ఎన్ని ఉల్లిపాయలు తినాలో తెలుసా?

ఇదీ చదవండి: సన్నగా ఉన్నా.. పొట్ట చుట్టూ కొవ్వు ఉందా? ఈ రెండు టిప్స్​తో ఫిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.