ETV Bharat / sukhibhava

Can I drink rain water : వర్షం నీరు తాగొచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

author img

By

Published : Jun 23, 2023, 4:15 PM IST

Rain Water Is Good To Drink : వర్షపు నీటిని తాగొచ్చా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, కొన్ని జాగ్రత్తలతో వర్షం నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిదే అంటోంది ఆయుర్వేదం. మరి ఆ జాగ్రత్తలేంటో మనమూ తెలుసుకుందాం.

drinking rain water benefits
drinking rain water benefits

Rain Water Is Good To Drink : వర్షపు నీటిని ఉపయోగించి వ్యవసాయం చేసేవారిని చాలామందిని చూసుంటాం. దీంతో పాటు వర్షపు నీటిని వివిధ రకాల పనులకు ఉపయోగించే వారిని కూడా చూసుంటాం. కానీ ఎప్పుడైనా వర్షపు నీటిని తాగొచ్చా? అన్న సందేహం మీకు వచ్చిందా! వర్షం నీరు తాగితే ఏమవతుంది అని మీకు అనిపించిందా? తగినన్ని ముందు జాగ్రత్తలతో ఈ నీటిని తాగొచ్చని చెబుతోంది ఆయుర్వేదం. వర్షపు నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని అంటోంది. వాస్తవానికి వాననీరు పలు ప్రయోజనాలు కలిగిస్తుందని ఇతర శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. వర్షపు నీటిని తాగడం వల్ల మానవ శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వైద వైద్యురాలు రేఖ రాధామణి. వర్షపు నీటి ప్రయోజనాలతో పాటు వాటిని ఎలా సేకరించాలి? ఎలా మంచినీటిని గుర్తించాలి? లాంటి అనేక ప్రశ్నలకు సోషల్​ మీడియాలో సమాధానం ఇచ్చారు.

వర్షపు నీటిని సేకరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం..
వర్షాకాలం మొదలైన కొద్ది రోజుల తర్వాత నీటిని సేకరించడం మంచిది. ఈ వర్షపు నీటిని సేకరించేందుకు రాగి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సేకరించిన నీటిని.. ఓ గిన్నెలో రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత ఉదయాన్నే వేడి చేసుకుని తాగాలి.

"వర్షం నీరు అమృతం లాంటిది. ఈ నీరు తాగడానికి కూడా రుచిగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ నీటిని తాగితే ఆరోగ్యంగా, అలసట లేకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే, కలుషిత ప్రాంతాల్లో ఈ నీటిని తాగడం మంచిది కాదు. ముఖ్యంగా దిల్లీ లాంటి అత్యంత కాలుష్య నగరంలో వర్షపు నీటిని తాగడం అంత మంచిది కాదు. దిల్లీ ప్రజలు వర్షపు నీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం. దుబాయ్.. లాంటి ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి వర్షం పడుతుంది. అలాంటి ప్రదేశాల్లో నివసించే ప్రజలు కూడా ఈ నీటిని తాగడం మంచిది కాదు."

--రేఖా రాధామణి, ఆయుర్వేద వైద్యురాలు

వర్షాకాలంలో పడే నీటిని తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే, ఈ నీరు మంచిదా? కాదా? అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అందుకే ఈ నీటిని తాగొచ్చా? లేదా? అని పరీక్షించేందుకు ఓ విధానాన్ని కూడా సూచించారు. ముందుగా వర్షపు నీటిని ఓ వెండి గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత.. అందులో బియ్యాన్ని వేసి ఉడికించాలి. కాసేపయ్యాక అన్నం రంగు మారకుండా ఉంటే.. ఆ నీరు తాగడానికి మంచిదని అర్థం.

ఇవీ చదవండి : మీరు తాగుతోన్న నీళ్లు స్వచ్ఛమైనవేనా.. ఇలా చెక్ చేస్కోండి

తలనొప్పి తగ్గాలంటే నీళ్లు తాగాలా! నీరు ప్రయోజనాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.