ETV Bharat / sukhibhava

13 ఏళ్లొచ్చినా పక్క తడుపుతున్నారా? - ఇలా చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 12:09 PM IST

Bedwetting Solutions in Teenage Children : చిన్న పిల్లలు నిద్రలో పక్క తడిపేయడం కామన్. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య తగ్గిపోతుంది. కానీ.. కొద్ది మందిలో ఈ సమస్య ఐదారేళ్లు దాటేవరకూ ఉంటుంది. అరుదుగా మాత్రమే.. టీనేజ్ వరకూ ఈ ఇబ్బంది వెంటాడుతుంది. మరి.. అలాంటి సమయంలో ఏం చేయాలి..? నిపుణుల సలహాలు ఏంటి..? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Bedwetting_Problems_in_Children
Bedwetting_Problems_in_Children

Bedwetting Solutions in Teenage Children : సాధారణంగా.. పసిపిల్లలు పక్కతడుపుతుంటారు. ఈ సమస్య.. పిల్లలకు మూడు లేదా నాలుగు సంవత్సరాలు వచ్చేవరకు ఉంటుంది. అయితే కొంత మంది పిల్లల్లో ఐదారేళ్లు దాటే వరకూ ఉంటుంది. కానీ.. టీనేజ్ వచ్చే వరకూ కొందరిలో ఈ సమస్య తగ్గదు. పెద్దైన తర్వాత కూడా పిల్లలు పక్కతడుపుతుంటే.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఆరాటంలో.. చాలా మంది తల్లిదండ్రులు కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే.. అలా చేయడం ద్వారా సమస్య పెరుగుతుందేకానీ.. తగ్గదని అంటున్నారు నిపుణులు. మరి, దీనికోసం ఏం చేయాలి? అసలు నిద్రలో పిల్లలు పక్కతడపడానికి కారణాలు ఏంటి..? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే - ముఖ్యంగా పెళ్లైన వాళ్లకు - ఈ సమస్యలు గ్యారెంటీ!

కారణాలేంటి..?

  • మానసిక ఒత్తిడి చిన్న పిల్లల్లో తరచుగా మూత్రవిసర్జనకు కారణం అవుతుంది.
  • తల్లిదండ్రుల భయం, కుటుంబ సభ్యుల మరణం, ప్రమాదాలు, కొత్తగా స్కూల్​కు వెళ్లడం కూడా ఈ సమస్యకు కారణమవుతాయి.
  • మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం.. లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
  • ఈ సమస్యతో ఉన్న పిల్లలు.. ఎక్కువ సమయం మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకుంటారు.
  • ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా.. మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది.
  • బిడ్డ వయసు 6, 7 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పక్కతడిపితే ఆలోచించాల్సిందే
  • ఈ సమస్య పరిష్కారానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

6 యోగాసనాలతో పని ఒత్తిడి మాయం! ఆఫీస్​లోనే కుర్చీలో ఈజీగా వేసేయండిలా!

నిపుణుల సూచనలివే:

మామూలుగా పిల్లలకు 5 ఏళ్లు వచ్చేసరికి.. పక్క తడిపే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే.. కొంతమందిలో ఆ వయసు దాటినా ఇది కొనసాగుతుంది. ఈ పరిస్థితిని ప్రైమరీ ఎన్యూరెసిస్‌ అంటారు. మరికొందరిలో మాత్రం ఒకసారి నియంత్రణలోకి వచ్చి.. పెద్దయ్యాక మరోసారి మొదలవుతుంది. దీన్ని సెకండరీ ఎన్యూరెసిస్‌ అంటారు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు కారణంగా జరుగుతుంది. రాత్రిపూట దుస్తులు తడుపుతుంటే.. దాన్ని నాక్టర్నల్‌ ఎన్యూరెసిస్‌ అనీ, పగటిపూట పడుకున్నప్పుడు మూత్రం పోస్తే.. దాన్ని డే టైం ఎన్యూరెసిస్‌ అనీ అంటారు.

మీ పిల్లల పరిస్థితికి ఈ రెండింటిలో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చు. ఈ సమస్యకు పరిష్కారం.. యూరాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లడమే. బ్లాడర్‌, యూరినరీ ట్రాక్ట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్‌, స్ట్రక్చరల్‌ అబ్‌నార్మాలిటీస్‌ వంటివి ఉంటే.. తగిన చికిత్స అందిస్తారు. అవేమీ లేకపోతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. వారు మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా కౌన్సెలింగ్, మందులు ఇస్తారు. బిహేవియర్‌ మాడిఫికేషన్‌, బ్లాడర్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. దాంతో సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది. ఇలా చేయాలి తప్ప, పిల్లల పట్ల కఠినంగా వ్యవహరించ కూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు పుట్టబోయే బిడ్డ రూపాన్ని - ఈ 6 అంశాలు నిర్ణయిస్తాయని మీకు తెలుసా?

పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్​లో పడ్డట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.