ETV Bharat / state

పులివెందులలో ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం..

author img

By

Published : Mar 12, 2021, 7:13 PM IST

కడప జిల్లా పులివెందులలో వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు.

avinash reddy
ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవం.. కేక్ కట్ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో వైకాపా జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ముందుగా ఆయన ఆడిటోరియంలో ప్రజా దర్బార్​ను నిర్వహించారు. ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపారు.

అనంతరం వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండా విలువలు, విశ్వసనీయత అనే పునాదులపై వైకాపా ఆవిర్భవించిందని అవినాష్ రెడ్డి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల ఆశీస్సులతో పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.

ఇదీ చదవండి: రాయచోటిలో శివరాత్రి ఉత్సవాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.