ETV Bharat / state

'రైల్వే లైన్​ సర్వే త్వరితగతిన పూర్తి చేయండి'

author img

By

Published : Oct 31, 2020, 10:39 PM IST

దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. జిల్లాలో పెండింగ్​లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త రైల్వే లైన్​కు సంబంధించిన సర్వే త్వరగా పూర్తి చేయాలన్నారు.

ys avinash reddy
ys avinash reddy

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాను సికింద్రాబాద్​లో కలిశారు. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త రైల్వే లైన్​కు సంబంధించిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన జీఎం... డిసెంబర్ మొదటి వారానికల్లా సర్వే నివేదికను రైల్వే బోర్డు, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.

మరోవైపు కడప- బెంగళూరు మధ్య రైల్వే లైన్​కు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కమలాపురం పట్టణంలో ఆర్​యూబీ, ఆర్వోబీ పనులు త్వరగా మొదలు పెట్టాలని కోరారు.

ఇదీ చదవండి

రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.