ETV Bharat / state

మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 12:22 PM IST

Viveka_Murder_Case_Approver_Dastagiri
Viveka_Murder_Case_Approver_Dastagiri

Viveka Murder Case Approver Dastagiri: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన తన భర్త దస్తగిరికి జైల్లో ప్రాణహాని ఉందని ఆయన భార్య ఆందోళన వ్యక్తం చేశారు. దస్తగిరిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేశారని ఆరోపించారు.

మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన

Viveka Murder Case Approver Dastagiri: వైఎస్ వేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైల్లో చంపేస్తారని.. అతడి భార్య షబానా ఆందోళన వ్యక్తంచేశారు. తన భర్త అప్రూవర్‌గా మారినప్పటి నుంచి పగ పెంచుకున్న కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరికించారని ఆరోపించారు. తన భర్తను ఏదో ఓ కేసులో అక్రమంగా ఇరికించి.. జైల్లో హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

తన భర్త ఇటీవల కాలంలో ఏ పంచాయితీలకు వెళ్లడం లేదని.. ఒకవేళ ఆయన వెళ్తే కచ్చితంగా కేసు నమోదు చేస్తారనే నేపథ్యంలో ఆయన అలాంటి వాటికి దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. అయితే తమ సమీప బంధువు అమ్మాయి విషయమై మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్​కు వెళ్లిన దస్తగిరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి అక్రమంగా జైలుకు తరలించారని ఆరోపించారు. ఇప్పటికే దస్తగిరిపై శ్రీకాళహస్తి, వేముల, తొండూరు తదితర ప్రాంతాలలో చాలా కేసులు పెట్టారని చెప్పారు. కానీ తన భర్తను జైల్లో ఎక్కడ హతమారుస్తారోనని భయంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తన భర్తకు ఏం జరిగినా ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారణమని తెలిపారు.

Dastagiri petetion వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. న్యాయ సహాయం అందించాలంటూ సుప్రీంకు దస్తగిరి

Viveka Murder Case Approver Dastagiri in police custody: వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరిని వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల కిందట ఎర్రగుంట్లకు చెందిన ఓ జంట.. ప్రేమ వివాహం(Love Marriage) చేసుకుంది. డ్రైవర్ దస్తగిరి యువతిని కారులో కిడ్నాప్ చేశారని.. రెండు రోజుల కిందట యువకుడి ఇంటికి వెళ్లి బెదిరించినట్లు తెలుస్తోంది. కులం పేరుతో దూషించాడని బాధితుడు లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం కమలాపురం కోర్టులో హాజరుపరచగా.. దస్తగిరి సహా ఐదుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

YS Viveka case Approver Dastagiri: వాళ్లు అంతు చూస్తామని బెదిరిస్తున్నారు: దస్తగిరి

అయితే దస్తగిరిని.. ఓ అమ్మాయి కిడ్నాప్‌ కేసులో ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేయడంతో.. భార్య షబానా పోలీస్‌ స్టేషన్‌ వద్ద మంగళవారం ఆందోళనకు దిగింది. తన భర్తను చూపించాలని మూడు గంటల నుంచి వేడుకుంటున్నా.. కనీసం పట్టించుకోవడం లేదంటూ.. షబానా వాపోయింది. తన బంధువుల అమ్మాయి ప్రేమ వివాహన్ని వద్దంటూ.. ఇంటికి తీసుకొస్తుండగా.. కక్షపూరితంగా కిడ్నాప్‌ కేసు పెట్టి అరెస్టు చేశారంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో వివేకా హత్య కేసులో అప్రూవర్​గా మారినప్పటి నుంచి పగ పెంచుకున్న అవినాష్ రెడ్డి తన భర్తను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది.

"నా భర్త దస్తగిరికి జైల్లో ప్రాణహాని ఉంది. గతంలో జైలులో మొద్దు శీనును ఎలా హతమార్చారో అదే తరహాలో నా భర్తను కూడా హత్య చేస్తారని అనుమానంగా ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో నా భర్త అప్రూవర్​గా మారినప్పటి నుంచి వైసీపీ నాయకులు పగ పెంచుకున్నారు. ఆయనపై ఎలాగైనా అక్రమ కేసులు బనాయించి.. జైల్లో హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారు. నా భర్తను వెంటనే విడుదల చేయాలి." - షబానా, దస్తగిరి భార్య

Viveka Murder Case Approver Dastagiri: కిడ్నాప్​ కేసులో.. దస్తగిరికి 14 రోజుల రిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.