ETV Bharat / state

యూనియన్​ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం.. చోరీకి విఫలయత్నం

author img

By

Published : Nov 8, 2020, 7:55 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని యూనియన్​ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి దోపిడీకి విఫలయత్నం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

యూనియన్​ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం : చోరీకి విఫలయత్నం
యూనియన్​ బ్యాంక్ ఏటీఎం ధ్వంసం : చోరీకి విఫలయత్నం

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని క్యాంబెల్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న యూనియన్​ బ్యాంక్ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఏటీఎంను ధ్వంసం చేశారు. అనంతరం దోపిడీకి విఫలయత్నం చేశారు. జమ్మలమడుగులోని ఆంధ్ర బ్యాంక్ ఏటీఎంను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టారని ఎస్​ఐ రవి కుమార్ పేర్కొన్నారు.

త్వరలోనే పట్టుకుంటాం..

డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీంను పిలిపించి సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలనతో దొంగలను త్వరగా పట్టుకుంటామని ఎస్​ఐ వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.