ETV Bharat / state

Lokesh with experts: 'ఆ రోజే నిర్ణయించుకున్నా.. అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం'

author img

By

Published : Jun 2, 2023, 7:36 PM IST

Updated : Jun 3, 2023, 6:26 AM IST

TDP National General Secretary Lokesh interaction with experts: లాయర్లకు నారా లోకేశ్ ఓ శుభవార్తను చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Lokesh
Lokesh

TDP National General Secretary Lokesh interaction with experts: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 114వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్రలో ఆయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి విడిది కేంద్రం వద్ద వివిధ రంగాల నిపుణులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొద్దుటూరులో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి..?, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లాయర్లు, డాక్టర్లకు జగన్ ప్రభుత్వం ఏ విధంగా అనాయ్యాలు చేస్తోంది..?, న్యాయవాదులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది..? వంటి తదితర అంశాలను నిపుణులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు.

Kanna In Mahanadu: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది: కన్నా లక్ష్మీనారాయణ

ఈ సందర్భంగా యువనేత నారా లోకేశ్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వమని.. జగన్ పాలనలో అన్ని రంగాల వారు బాధితులే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం సొంత జిల్లా కడప, సొంత నియోజకవర్గం పులివెందులకి ఏం చేశాడో జగన్ చెప్పగలడా..? అని లోకేశ్ ప్రశ్నించారు. ఉమ్మడి కడప జిల్లాలోని ప్రజలు 10కి 10 సీట్లు ఇస్తే జగన్ చేసింది ఏంటి..?, దొంగ చేతికి తాళం ఇస్తే ఏం జరిగింది..? అందరూ దోపిడీకి గురయ్యారని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి రాగానే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం..

Lokesh అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ తో గ్రామాల్లో నిరంతరం తాగునీరు.. లోకేశ్

అనంతరం లాయర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు, టీచర్లు, ఐటీ నిపుణులు అందరిని జగన్.. విపరీతంగా వేధిస్తున్నారని నారా లోకేశ్ గుర్తు చేశారు. జగన్ పాలనలో ఏపీ బీహార్‌తో పోటీ పడుతుందని.. ప్రస్తుతానికి షాపులు, వ్యాపారాల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఓటేస్తే జగన్ అండ్ కో ఇంటికొచ్చి దోచుకుంటారని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ హయాంలో న్యాయ విభాగానికి నిధులు కేటాయించి.. కొత్త భవనాలు, లైబ్రరీలు కట్టించడానికి పనులు ప్రారంభించామన్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి.. ఆ పనులను నిలిపివేసిందన్నారు.

''నేను సాక్షిపై పరువు నష్టం దావా కేసు వేశాను. ఆ సమయంలో వైజాగ్ కోర్టుకు వెళ్లాను. ఆ కోర్టుల్లో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అప్పుడు అర్థమైంది. ఆ రోజే నిర్ణయించుకున్నా న్యాయ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. కొత్త భవనాలు, జూనియర్ లాయర్ల కోసం కోర్టులోనే లైబ్రరీ, ఇతర మౌలిక వసతులు కల్పిస్తాం. అడ్వకేట్లకు ప్రత్యేక ఇన్స్యూరెన్స్ స్కీం తీసుకురావడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అడ్వకేట్లకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తాం. ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. ఫైబర్ గ్రిడ్ పథకాన్ని చంపడానికి నాపై అనేక ఆరోపణలు చేశారు. ఫైబర్ గ్రిడ్ దగ్గర నుండి స్కిల్‌డెవలప్మెంట్ వరకూ అనేక ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరుపించలేకపోయారు. ఎవరూ అడగకపోయినా ఆస్తులు ప్రకటించిన కుటుంబం మాది. మాకు జగన్ లా దోచుకొని జైలుకి వెళ్లాలి అనే ఆశ లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాం.''_నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

CPI on YSRCP: సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి సమాధి కట్టారు: సీపీఐ

Last Updated : Jun 3, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.