ETV Bharat / state

కొడుకు మృతికి కారణమని కక్ష పెంచుకున్నాడు.. మరో నలుగురితో కలిసి కడతేర్చాడు...

author img

By

Published : Feb 25, 2023, 10:48 PM IST

Police arrested five people in AP: తన కుమారుడి మృతికి అతని స్నేహితుడే కారణం అంటూ ఓ తండ్రి తన మరో కుమారుడి కలిసి అతన్ని హత్య చేయించాడు. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. విచారణ చేపట్టిన పోలీసులు మెుత్తం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Etv Bharat
Etv Bharat

Police arrested five people in the murder case: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పాములూరు రోడ్డులో ఈనెల 20వ తేదిన రాత్రి విజయ్ కుమార్ హత్య ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వేంపల్లె పోలీసు స్టేషన్​లో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వేంపల్లెలోని ప్రియా తోటలో నివాసం ఉంటున్న హతుడు విజయ్ కుమార్​, కోలా రేవంత్ కుమార్, నక్క రామాంజనేయులు, ముగ్గురు స్నేహితులు. 2020లో మండలంలోని నందిపల్లె వద్ద చెరువు వద్దకు స్విమ్మింగ్​ ​ కోసం వెళ్లారు. అప్పట్లో ప్రమాదవశాత్తు కోలా రేవంత్ కుమార్ చెరువులో పడి మృతి చెందాడు.

రేవంత్ కుమార్ మృతికి విజయ్ కుమారే కారణమని రేవంత్ కుమార్ తండ్రి కోలా రామాంజనేయులు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోలా రామాంజనేయులు మరో కుమారుడు కోలా శ్రావణ కుమార్ ఎలాగైన విజయ్ కుమార్​ను చంపాలనున్నారు. అందుకోసం కొనేటి మహేందర్, రౌతు గోవర్ధన్, కొప్పాలి చరణ్ తేజలతో మాట్లాడి 4 లక్షలకు సుపారి ఇచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఈనెల 20వ తేదీన హతుడు విజయ్ కుమార్​ను మద్యం తాగేందుకు వెళ్దామని చెప్పి అందరు కలిసి పాములూరు రోడ్డులోని నాగల కట్ట వద్ద గల ముగ్గురాళ్లకు వెళ్లే బండ్ల బాటలోకి తీసుకువెళ్లారు. విజయ్ కుమార్ చేత ఫుల్​గా మద్యం తాగించారు. అనంతరం కోలా రామాంజనేయులకు పిలిచారు. అనంతరం బండరాయి, బీరు బాటిల్స్​తో తల మీద కొట్టగా విజయ్ కుమార్ చనిపోయి నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బైకులో ఉన్న పెట్రోలును విజయ్ కుమార్ పై పోసి నిప్పు పెట్టినట్లు చెప్పారు.

కోలా రామాంజనేయులు వద్ద మహేందర్, రౌతు గోవర్ధన్, కొప్పాలి చరణ్ తేజ 50 వేలు డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రక్తం మడుగులో ఉన్న చొక్కాను నంది పల్లె చెరువులో పడేసి అక్కడి నుంచి పారిపోయినట్లు డీఎస్పీ తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను పట్టుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.