ETV Bharat / state

ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం: మిథున్‌రెడ్డి

author img

By

Published : Jul 17, 2019, 7:41 PM IST

ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ ధ్యేయమని ఉద్ఘాటించారు. దిల్లీలో మిథున్‌రెడ్డి ''ఈనాడు-ఈటీవి-ఈటీవి భారత్​'' ముఖాముఖీలో మాట్లాడారు.

వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి

కేంద్రం, పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉంటూనే... రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో రాజకీయ పరిస్థితులను బట్టి... ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన సందర్భంగా... కాంగ్రెస్, భాజపా ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లోనూ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పిన మిథున్​రెడ్డి... 22 మంది వైకాపా ఎంపీలు బృందాలుగా ఏర్పడి శాఖల వారీగా ఎక్కువ నిధులు సాధించడానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దిల్లీలో వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ''ఈనాడు-ఈటీవి-ఈటీవి భారత్​''తో ప్రత్యేకంగా మాట్లాడారు.

వైకాపా లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి

ఇదీ చదవండీ...

'గ్రాఫిక్స్​తో అమరావతిని..భ్రమరావతిగా మార్చారు'

Intro:Ap_gnt_61_16_guru_pounami_vedukalu_palabhishekam_av_AP10034

Contributor : k.vara prasad ( prathipadu), guntur

Anchor : గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయిబాబా మందిరంలో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పాలభిషేకాలు చేసేందుకు భక్తులు ఉత్సాహంగా వచ్చారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో షిరిడి సాయి మందిర్ లో గురు పౌర్ణమి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే సాయి బాబాకు, పరమేశ్వరునికి సామూహిక పంచామృతాభిషేకం , రుద్రాభిషేకం జరిపారు. వేలాది మంది భక్తులు బాబాకు పాలాభిషేకం చేసేందుకు తరలి వచ్చారు. గత 20 ఏళ్లుగా ఈ ఆలయంలో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు జరుపుతున్నారు. ఆలయం నిర్మించేందుకు స్థలంతో పాటు బాబా విగ్రహాన్ని ఇచ్చిన దాత శ్రీరాం రామరామోహన రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నిర్వాకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


Body:end


Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.