ETV Bharat / state

ACCIDENT : వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం... భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

author img

By

Published : Oct 25, 2021, 12:47 AM IST

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఐషర్ వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో భర్త మృతి చెందగా... భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితురాలిని కడప రిమ్స్​కు తరలించారు.

వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం
వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం

కడప జిల్లా వేముల మండలం చాగలేరు గ్రామానికి చెందిన పీరయ్య, మస్తానమ్మ అనే దంపతులు... ద్విచక్రవాహనంపై లింగాల మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఓ వేడుకకు వచ్చారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. ఇప్పట్ల వద్ద ఎదురుగా వస్తున్న ఐషర్ వాహనం భైక్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీరయ్య అక్కడికక్కడే మృతి చెందగా, మస్తానమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు 108 వాహనంలో మస్తానమ్మను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్​కు తీసుకువెళ్లారు. వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీచదవండి.

ఆ ఇంట్లో ఒకరిగా మారిన ఓ ఉడుత కథ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.