ETV Bharat / state

'ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు'

author img

By

Published : Feb 5, 2020, 1:16 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయం ఎదుటు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపించారు.

municipal workers agitation at proddatur
ప్రొద్దుటూరు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ప్రొద్దుటూరు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఆరోగ్యం సహకరించటం లేదని సెలవు అడిగినా, పని చేయాలని అధికారులు ఒత్తిడి చేయటంతోనే నరసింహులు అనే కార్మికుడు విధుల్లోనే గుండెపోటుతో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వెళ్తుంటే తమను హీనంగా చూస్తున్నారని వాపోయారు. మేస్త్రీ జీవో లత మహిళా కార్మికులనీ చూడకుండా, నీచంగా మాట్లాడుతున్నారనీ వాపోయారు. కమిషనర్ తమను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఆమెను ప్రొద్దుటూరు కార్యాలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పింఛను తొలగించడంపై కడపలో వృద్ధులు, వితంతువుల ధర్నా

Intro:Ap_cdp_41_05_muncipal_karmikula_andolana_avb_ap10041
Please: proddatur
Reporter: madhusudhan

కడపజిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం లో అధికారులు అధిక పని భారం పెడుతున్నారని పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘం లో నలభై వార్డులు ఉండగా 430 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. అందులో 80 మంది డ్రైవర్లు గాను, ఆఫీసులో పని చేయుటకు వెళ్లారని మిగిలిన వారితో వార్డులు నెట్టుకొస్తున్నామని అయితే ఇటీవల కాలంలో పారిశుద్ధ్య కార్మికుల పై ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి రోజు పారిశుద్ధ కార్మికుడు నరసింహులు తనకు ఆరోగ్యం సరిగా లేదు సెలవు ఇవ్వాలని అడిగినా కూడా అధికారులు పనిచేయాలని చెప్పడంతో పనికి వెళ్లి నరసింహులు డ్యూటీలోనే గుండెపోటు వచ్చి మరణించాడని ఇందుకు కారణమైన సంబంధిత అధికారులను విచారణ చేసి సస్పెండ్ చేయాలని కోరారు. తమ సమస్యల గురించి అధికారులకు తెలుజేసేందుకు వెళితే అధికారులు తమను హీనంగా చుస్తున్నారని , మాట్లాడుతున్నారని వాపోయారు.
బైట్:
చంటి(కార్మికుడు)Body:ఆConclusion:ఆ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.