ETV Bharat / state

Save Me: పోలీసుల నుంచి కాపాడండి.. జిల్లా ఎస్పీకి ఓ వ్యక్తి ఫిర్యాదు

author img

By

Published : Mar 21, 2022, 9:25 AM IST

Complaint on Police: పోలీసుల బెదిరింపుల నుంచి కాపాడాలంటూ.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహబూబ్ బేగ్‌.. ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఓ స్థల వివాదంలో ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసులు.. దారి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏదో ఒక రకంగా కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. పేర్కొన్నారు.

Kadapa Autonagar Association President Complaint on police to SP
ఎస్పీకి కడప జిల్లా ఆటోనగర్‌ అసోసియేషన్ అధ్యక్షుడి ఫిర్యాదు

Complaint: పోలీసుల బెదిరింపుల నుంచి కాపాడాలంటూ.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహబూబ్ బేగ్‌.. ఎస్పీ అన్బురాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆటోనగర్‌ అసోసియేషన్‌ ద్వారా 56 ఎకరాల్లో స్థలం కొని సొంత ఖర్చుతో రోడ్లు వేశామని.. మహబూబ్‌ బేగ్‌.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ఇతరులకు హక్కు లేకపోయినప్పటికీ.. అసోసియేషన్‌ పక్కనే ఉన్న ఓ స్థల యజమాని దౌర్జన్యంగా రాకపోకలు సాగించేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నాడని పేర్కొన్నారు. తామంతా గట్టిగా ప్రశ్నించగా ఆయన పనులు నిలిపివేశాడని తెలిపారు.

స్థల వివాదంపై స్పందించిన ప్రొద్దుటూరు గ్రామీణ పోలీసులు.. దారి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏదో ఒక రకంగా కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నారని.. ఆటోనగర్ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహబూబ్ బేగ్‌.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయంపై ఇవాళ కడప ఎస్పీని నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తామని.. అసోసియేషన్‌ నాయకులు తెలిపారు.

ఇదీ చదవండి:

TDP On Vidya Deevena: ఎయిడెడ్‌లోనూ విద్యా దీవెన అమలు చేయాలి: తెదేపా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.